SA vs AUS: చరిత్ర సృష్టించిన వార్నర్‌.. సచిన్‌ వరల్డ్‌ రికార్డు బ్రేక్

బ్లోమ్‌ ఫోంటెయిన్ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో డేవిడ్‌ వార్నర్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.

Update: 2023-09-09 14:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: బ్లోమ్‌ ఫోంటెయిన్ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో డేవిడ్‌ వార్నర్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 93 బంతులు ఎదుర్కొన్న వార్నర్‌ 12 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 106 పరుగులు చేశాడు. వార్నర్‌కు ఇది 20 వన్డే సెంచరీ. ఓవరాల్‌గా డేవిడ్‌ భాయ్‌కు ఇది 46వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన వార్నర్‌ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా వార్నర్‌ రికార్డులకెక్కాడు.

ఇప్పటివరకు ఓపెనర్‌గా 46 సెంచరీలు వార్నర్‌ నమోదు చేశాడు. ఈ క్రమంలో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్(45) రికార్డును వార్నర్‌ బ్రేక్‌ చేశాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా 6,000 పరుగుల మైలు రాయిని వార్నర్‌ అందుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను అందుకున్న నాలుగో ఓపెనర్‌గా వార్నర్‌ నిలిచాడు. వార్నర్‌ 140 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(121) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 392 పరుగుల భారీ స్కోరు చేసింది.


Similar News