Cristiano Ronaldo: రొనాల్డో సరికొత్త రికార్డు.. తొలి ప్లేయర్‌గా..

ఫుట్ బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Update: 2023-06-21 16:20 GMT

లండన్: ఫుట్ బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు. 200 మ్యాచ్‌లు ఆడిన తొలి ఫుట్ బాల్ ఆటగాడిగా రొనాల్డో గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. ఈ పోర్చుగల్ స్టార్ ఆటగాడు యూరో కప్-2024 క్వాలిఫయింగ్ టోర్నీలో మంగళవారం ఐస్ లాండ్‌తో 200వ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో పోర్చుగల్ 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఆ ఏకైక గోల్ కూడా 38 ఏళ్ల రొనాల్డో సాధించినదే కావడం విశేషం.

పోర్చుగల్ తరఫున 200 మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కడం తన అదృష్టంగా రొనాల్డో పేర్కొన్నాడు. తనకు ఫుట్ బాల్ ఆటపై, తన దేశంపై ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక మ్యాచ్‌లు కువైట్‌కు చెందిన బాదర్ అల్ ముతావా (196 మ్యాచ్ లు), మలేషియాకు చెందిన చిన్ అన్ (195), ఈజిప్ట్‌కు చెందిన అహ్మద్ హసన్ (184), భారత్‌కు చెందిన సునీల్ ఛెత్రీ (137 మ్యాచ్‌లు) ఆడారు.


Similar News