రైట్ టు మ్యాచ్ (RTM) విధానంపై బీసీసీఐకి ఫ్రాంఛైజీల ఫిర్యాదులు

2025 ఐపీఎల్(IPL) వేలానికి ముందు ఫ్రాంఛైజీల అభ్యర్థన మేరకు బీసీసీఐ(BCCI) ఆధ్వర్యంలోని ఐపీఎల్ గవర్నింగ్ కమిటీ.. సమావేశం అయింది.

Update: 2024-10-05 12:00 GMT

దిశ, వెబ్ డెస్క్: 2025 ఐపీఎల్(IPL) వేలానికి ముందు ఫ్రాంఛైజీల అభ్యర్థన మేరకు బీసీసీఐ(BCCI) ఆధ్వర్యంలోని ఐపీఎల్ గవర్నింగ్ కమిటీ.. సమావేశం అయింది.ఈ క్రమంలో 2024 డిసెంబర్ లో జరిగే మెగా వేలంపై కొత్త రూల్స్(New Rules) తీసుకొచ్చారు. ఐదుగురు ప్లేయర్ల రిటెన్షన్‌తో పాటు ఒక ప్లేయర్ కు రైట్‌టు మ్యాచ్ (RTM)తో కలిపి ఆరుగురు ప్లేయర్లను ఫ్రాంచైజీలు అంటిపెట్టుకునే విధంగా రూల్స్ తెచ్చారు. అయితే ఇక్కడే.. రైట్ టు మ్యాచ్ (RTM) నియమాన్ని BCCI తిరిగి ప్రవేశపెట్టడం IPL ఫ్రాంచైజీలకు తలనొప్పిని తీసుకొచ్చింది. IPL వేలం RTM నిబంధన మార్పుపై ఫ్రాంచైజీలు బీసీసీఐ కి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. రైట్ టు మ్యాచ్ (RTM) అంటే.. ఎదైన జట్టులోని ప్లేయర్ ను రిటెన్షన్ చేయలేక పోయినప్పుడు అతను వేలంలో పాల్గొంటాడు.

ఈ క్రమంలో ఆ ప్లేయర్ వేలంలో అమ్ముడు పోయిన ధరను పాత జట్టు చెల్లించి రైట్ టు మ్యాచ్ (RTM) చేసుకునేందుకు అవకాశం ఉండేది. అయితే తాజా రూల్ ప్రకారం.. సదరు ప్లేయర వేలంలో అమ్ముడు పోయిన మొత్తం తో పాటు బిడ్ వేసిన జట్టు అదనంగా రేటు వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయంతో వేలం పాడిన జట్టుకు, ప్లేయర్ కు మంచి జరిగినప్పటికీ, పాత జట్టుకు నిరాశ ఎదురవుతుందని.. ఆయా జట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపైనే బీసీసీఐ‌కి పలు జట్లు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కీలకమైన ప్లేయర్లు ఒక్క జట్టుకే పరిమితం కావొద్దని.. గవర్నింగ్ బాడీ ఇప్పటికే రిటెన్షన్ ప్లేయర్ల రుసుములను భారీగా నిర్ణయించింది, రిటెన్షన్‌లలో వరుసగా నాలుగు, ఐదవ స్థానంలో ఉన్న ఆటగాళ్లకు INR 18 కోట్లు, INR 14 కోట్లు చెల్లించాలని ప్రకటించిన విషయం తెలిసిందే.


Similar News