Cameron Green: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..గాయంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి స్టార్ ఆల్‌రౌండర్ దూరం..!
ఇంగ్లండ్(England) పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా (Australia)కు బిగ్ షాక్ తగిలింది.
దిశ, వెబ్‌డెస్క్:ఇంగ్లండ్(England) పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా (Australia)కు బిగ్ షాక్ తగిలింది.ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్,25 ఏళ్ల కామెరూన్ గ్రీన్(Cameron Green) గాయం కారణంగా ఇంగ్లండ్ తో మిగిలిన రెండు ODIల నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు.చెస్టర్-లీ-స్ట్రీట్(Chester-le-Street) వేదికగా మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో గ్రీన్ గాయపడ్డట్టు తెలుస్తోంది. నాలుగో వన్డేకు ముందు నిర్వహించిన వైద్య పరీక్షలలో అతడి వెన్నుకు గాయమైనట్టు తేలింది. దీంతో ఆస్ట్రేలియాకు తిరుగు ప్రయాణమయ్యాడు. గాయం తీవ్రతపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. కాగా గ్రీన్ మూడో వన్డేలో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. ఆ మ్యాచ్‌లో గ్రీన్ 2 వికెట్లు తీసి 45 పరుగులు చేశాడు. గాయం తీవ్రత ఎక్కువైతే నవంబర్ నుంచి జరిగే భారత్- ఆసీస్(IND-AUS) మధ్య జరగబోయే బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ (Border-Gavaskar Test series)లో అతడు ఆడేది అనుమానమేనని క్రికెట్ ఆస్ట్రేలియా(CA) వర్గాల సమాచారం.