డబ్ల్యూటీటీ టోర్నీలో సత్తాచాటిన భారత యువ ప్యాడ్లర్లు.. 27 పతకాలు కైవసం

వరల్డ్ టేబుల్ టెన్నిస్(డబ్ల్యూటీటీ) డమ్మామ్ యూత్ కంటెండర్ టోర్నీలో భారత యువ ప్యాడ్లర్లు అదరగొట్టారు.

Update: 2024-09-27 18:48 GMT

దిశ, స్పోర్ట్స్ : సౌదీ అరేబియాలో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్(డబ్ల్యూటీటీ) డమ్మామ్ యూత్ కంటెండర్ టోర్నీలో భారత యువ ప్యాడ్లర్లు అదరగొట్టారు. 12 ఈవెంట్లలో ఆరు టైటిల్స్‌ను సాధించారు. గర్ల్స్ సింగిల్స్ అండర్-19 కేటగిరీలో సుహానా సైనీ, అండర్-17 కేటగిరీలో హంసిని మథన్, అండర్-19 మిక్స్‌డ్ డబుల్స్‌లో జెన్నిఫెర్ వర్గీస్-ముత్తు రాజశేఖరన్ విజేతలుగా నిలిచారు. కావ్య భట్, సార్థక్ ఆర్య రెండు స్వర్ణాలతో మెరిశారు. గర్ల్స్ సింగిల్స్ అండర్-15 కేటగిరీలో కావ్య భట్, బాయ్స్ సింగిల్స్ అండర్-15 కేటగిరీలో సార్థక్ ఆర్య టైటిల్స్ లసాధించగా.. అండర్-15 మిక్సడ్ డబుల్స్ విభాగంలో సార్థక్ ఆర్య-కావ్య భట్ జోడీ విజేతగా నిలిచింది. మొత్తంగా టోర్నీలో ఆరు స్వర్ణాలతోపాటు 7 రజతాలు, 14 కాంస్య పతకాలు దక్కాయి. 


Similar News