Bumrah : తొలి భారత బౌలర్‌గా.. బుమ్రా మరో అరుదైన రికార్డు

భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.

Update: 2025-01-01 12:16 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 907 పాయింట్లతో బుమ్రా అగ్రస్థానంలో నిలిచాడు. తద్వారా భారత్ తరఫున అత్యధిక టెస్ట్ ర్యాంకింగ్స్‌ పాయింట్లు సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. అంతకు ముందు అశ్విన్ 904 పాయింట్లు సాధించాడు. ఆసీస్ బౌలర్ హేజల్ వుడ్ (843) పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ (837) పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. రవీంద్ర జడేజా(750) పాయింట్లతో ఒక స్థానం డౌన్ అయి పదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఎంసీజీ టెస్ట్‌లో రాణించిన జైస్వాల్, నితీశ్ ర్యాంకులు మెరుగయ్యాయి. జైస్వాల్(854) పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. నితీశ్ కుమార్ రెడ్డి (528) పాయింట్లతో 20 స్థానాలు ఎగబాకి.. 53వ స్థానంలో నిలిచాడు. 

Tags:    

Similar News