అతడిని సరిగ్గా సానబెడితే.. డేల్ స్టెయిన్‌లా అవుతాడు : Brian Lara

ఐపీఎల్ 2021 సీజన్‌‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ ఇచ్చింది.

Update: 2023-08-11 11:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2021 సీజన్‌‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ ఇచ్చింది. అయితే అదే సీజన్‌లో నటరాజన్ కరోనా బారిన పడడంతో తుది జట్టులోకి వచ్చిన కశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్.. తన బౌలింగ్ స్పీడ్‌తో సెన్సేషన్ అయిపోయాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచుల్లో 22 వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్, 14 మ్యాచుల్లోనే ‘ఫాస్టెస్ట్ బాల్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు అందుకున్నాడు. అయితే టీమిండియాకి స్టార్ బౌలర్ అవుతాడనుకున్న ఉమ్రాన్ మాలిక్, సరైన అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోతున్నాడు. ఉమ్రాన్ మాలిక్.. 10 వన్డేలు ఆడి 13 వికెట్లు తీశాడు. 8 టీ20 మ్యాచుల్లో 11 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. వెస్టిండీస్ టూర్‌లో ఉమ్రాన్ మాలిక్ నుంచి సరైన బౌలింగ్ పర్ఫామెన్స్ రాకపోవడంతో తుది జట్టులో చోటు కోల్పోయాడు.

ఈ నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్‌‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్ బ్రియాన్ లారా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఉమ్రాన్ మాలిక్‌ని సరిగ్గా సానబెడితే సెన్సేషనల్ స్టార్ అవుతాడు. అయితే అతను ముందు ఎంత ఫాస్ట్‌గా బౌలింగ్ చేసినా, వరల్డ్ బెస్ట్ ప్లేయర్లను ఇబ్బంది పెట్టలేమనే విషయాన్ని క్లియర్‌గా తెలుసుకోవాలని.. బంతిని వేగంగా వేయడం మాత్రమే సరిపోదు, దాంతో ఏదైనా మ్యాజిక్ చేయగలగాలి. మ్యాచ్ పరిస్థితిని బట్టి టీమ్‌కి ఏం కావాలో తెలుసుకుని బౌలింగ్‌లో వేరియేషన్స్ తీసుకురాగలగాలి.. ఉమ్రాన్ మాలిక్ ఇంకా కుర్రాడే, మున్ముందు చాలా విషయాలు తెలుసుకుంటాడు, నేర్చుకుంటాడు అని బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు. ఫాస్ట్ బౌలర్లలో చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఉమ్రాన్ మాలిక్‌ని సరిగ్గా సానబెడితే, టీమిండియాకి డేల్ స్టెయిన్‌ లాంటి బౌలర్ అవుతాడు. అందుకే స్టెయిన్‌తో అతనికి శిక్షణ ఇప్పించడమే కరెక్ట్..’ అంటూ కామెంట్ చేశాడు.


Similar News