BREAKING : ఒలింపిక్స్ క్రీడల ముగింపు వేడుక‌ల్లో భారత ప‌తాక‌ధారులుగా PR శ్రీజేష్‌ ,మ‌ను భాక‌ర్‌

పారిస్ ఒలింపిక్స్ లో నిన్న జరిగిన హాకీ రజత పతాక పోరులో భారత్, స్పెయిన్ పై 2-1 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Update: 2024-08-09 10:50 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పారిస్ ఒలింపిక్స్ లో నిన్న జరిగిన హాకీ రజత పతాక పోరులో భారత్, స్పెయిన్ పై 2-1 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే భారత పురుషుల హాకీ జట్టు గోల్ కీపర్ పీ.ఆర్. శ్రీజేష్ నిన్న తన చివరి మ్యాచ్ ఆడేశాడు. ఈ సారి జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలే తనకు ఆఖరివని విశ్వ క్రీడల ప్రారంభానికి ముందే శ్రీజేష్ ప్రకటించాడు. టోర్నీలో జరిగిన ప్రతి మ్యాచులో తన అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ ప్రత్యర్థి జట్లకు అడ్డుకట్టగా నిలబడి, భారత్ కాంస్య పతకం గెల్వడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.ఈ కారణంగా అతన్ని పతాకదారుడిగా ఎంపిక చేశారు.

అయితే.. షూట‌ర్ మ‌ను భాక‌ర్ పేరును పతాకదారిగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) ఇదివరకే ప్ర‌క‌టించింది.కాగా.. షూట‌ర్ మ‌ను భాక‌ర్ విశ్వ క్రీడ‌ల్లో ఒకే సారి రెండు కాంస్య ప‌త‌కాలు గెలిచి చరిత్ర సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుక‌ల్లో భార‌త జాతీయ జెండా ప‌తాక‌ధారి అవ‌కాశాన్ని తాజాగా హాకీ గోల్‌కీప‌ర్ పీ. ఆర్. శ్రీజేష్‌కు కూడా క‌ల్పించారు. పీ. ఆర్. శ్రీజేష్‌, మ‌ను భాక‌ర్‌ భారత ప‌తాక‌ధారులుగా ఉంటారని భారత ఒలింపిక్ సంఘం ఇవాళ ప్ర‌క‌టించింది. శ్రీజేష్ విషయంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) స‌భ్యులు భావోద్వేగ‌పూరిత నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు 'IOA' అధ్య‌క్షురాలు పీ.టీ. ఉష తెలిపారు.దీంతో ముగింపు వేడుకల్లో భారత ప‌తాక‌ధారులుగా పీఆర్ శ్రీజేష్‌, మ‌ను భాక‌ర్ ఉండనున్నారు. 


Similar News