Breaking : మహిళల T20 ప్రపంచకప్ నిర్వహణ కోసం ఆర్మీ సాయం కోరిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు..

ఈ సంవత్సరం అక్టోబర్ లో బంగ్లాదేశ్ వేదికగా మహిళల T20 ప్రపంచకప్ జరగబోతుందన్న విషయం తెలిసిందే.

Update: 2024-08-10 08:12 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఈ సంవత్సరం అక్టోబర్ లో బంగ్లాదేశ్ వేదికగా మహిళల T20 ప్రపంచకప్ జరగబోతుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. అక్టోబర్ 3-20 తేదీలలో జరగనున్న మహిళల T20 ప్రపంచ కప్ నిర్వహణ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఆ దేశ ఆర్మీ చీఫ్ నుండి భద్రత సహాయం కోరింది. టోర్నమెంట్ నిర్వహించడానికి ఆర్మీ సహాయం కోరుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ "వాకర్-ఉజ్-జమాన్‌"కు ఒక లేఖ రాసింది.

కాగా.. బంగ్లాదేశ్ దేశంలో హింసాత్మక నిరసనలు చోటు చేసుకుంటున్న ఘటనలను ICC పర్యవేక్షిస్తోంది.ఇంకో నెల వరకు పరిస్థితి ఇలానే ఉంటే T20 ప్రపంచకప్ నిర్వహణ కోసం భారతదేశం, UAE, లేదా శ్రీలంకలను ICC ఎంపిక చేయవచ్చని సమాచారం.అయితే ఈ విషయంపై BCB అంపైరింగ్ కమిటీ చైర్మన్ ఇఫ్తేకర్ అహ్మద్ మాట్లాడుతూ.. 'మేము ఈ టోర్నమెంట్‌ను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నామని, మహిళల T20 ప్రపంచకప్‌కు ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉన్నందున భద్రత కోసం ఆర్మీ సహాయం కోరూతూ మేము ఆర్మీ చీఫ్‌కి లేఖ రాశామని తెలిపారు. కాగా మహిళల టీ20 ప్రపంచకప్‌ మ్యాచులను బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ మరియు మీర్పూర్ అనే రెండు నగరాల్లో నిర్వహించనున్నారు.


Similar News