దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్లో కళ్లు చెదిరే క్యాచ్‌లను చూస్తూనే ఉంటాం. రెప్పపాటు కాలంలో గ్రౌండ్లో ఫీల్డర్ చేసే విన్యాసానికి ఫిదా అవుతుంటాం. తాజాగా క్రికట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్ ఆవిష్కృతం అయ్యింది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నీలో చోటు చేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా హంప్‌షైర్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ససెక్స్ స్టార్ బ్రాడ్లీ కర్రీ బౌండరీ లైన్ వద్ద ఈ స్టన్నింగ్ క్యాచ్ అందుకొని ఔరా అనిపించాడు. టైమల్ మిల్స్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఈ కళ్లు చెదిరే క్యాచ్ ఫీట్ నమోదైంది. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాతో పాటు క్రికెట్‌ను షేక్ చేస్తోంది.
టైమల్ మిల్స్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఈ కళ్లు చెదిరే క్యాచ్ ఫీట్ నమోదైంది. ఈ ఓవర్ రెండో బంతిని మిల్స్ ఫ్లాట్‌గా వేయగా.. హంప్‌షైర్ బ్యాటర్ హావెల్ స్వీప్ షాట్ ఆడాడు. గాల్లోకి లేచిన బంతి సిక్సర్‌గా వెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ బౌండరీ లైన్ వద్ద పరుగెత్తుకుంటూ వచ్చిన బ్రాడ్లీ కర్రీ.. సూపర్ మ్యాన్‌లా గాల్లోనే సూపర్ డైవ్ చేసి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు.
STOP WHAT YOU ARE DOING
— Vitality Blast (@VitalityBlast) June 16, 2023
BRAD CURRIE HAS JUST TAKEN THE BEST CATCH OF ALL TIME 🤯#Blast23 pic.twitter.com/9tQTYmWxWI