Border-Gavaskar Trophy: పుజారా, ర‌హానే ప్లేస్ లో ఆ ఇద్దరు యంగ్ ప్లేయర్లను ఆడించాలి: దినేష్ కార్తీక్

ఈ ఏడాది నవంబర్ లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరుగనున్న విషయం తెలిసిందే.

Update: 2024-09-03 00:00 GMT

దిశ, వెబ్‌డెస్క్:ఈ ఏడాది నవంబర్ లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరుగనున్న విషయం తెలిసిందే. నవంబరు 22న ప్రారంభం కానున్న ఈ ఐదు టెస్టుల సిరీస్ వచ్చే ఏడాది జనవరి 7న ముగియనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే టీమిండియా 2018-19, 2020-21 సీజన్లలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని వరుసగా రెండుసార్లు గెలిచి సత్తా చాటింది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఈసారి బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ ఐదు టెస్టు మ్యాచ్‌లుగా జ‌రుగ‌నుంది. 1992 త‌ర్వాత ఇరుజ‌ట్లు ఐదు టెస్టుల‌ సిరీస్ ఆడ‌డం ఇదే తొలిసారి.కాగా గత రెండు సీజన్లలో టీమిండియా చేతిలో ఓటమి చెందిన ఆసీస్ ఈసారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంది.

ఈ ట్రోఫీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్న నేప‌థ్యంలో భార‌త మాజీ ఆట‌గాడు దినేశ్ కార్తీక్ జ‌ట్టు కూర్పుపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.ఈ ట్రోఫీకి గిల్, సర్ఫరాజ్ ను ఎంపిక చేయాలని కార్తీక్ అన్నారు. మిడిలార్డ‌ర్‌లో న‌యావాల్ ఛ‌తేశ్వ‌ర్ పూజారా,అజింక్యా ర‌హానే స్థానాల్లో వీరిద్దరూ ఆడితే బాగుంటదని అభిప్రాయ‌ప‌డ్డాడు.ఈ ఏడాది ఆరంభంలో స్వ‌దేశంలో ఇంగ్లండ్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో గిల్, స‌ర్ఫ‌రాజ్‌లు అద్భుతంగా రాణించారని గుర్తు చేశారు. సీనియర్ల ప్లేస్ ను భర్తీ చేయడం కష్టమని, కానీ గిల్, స‌ర్ఫ‌రాజ్‌ల‌కు సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడ‌గ‌ల ద‌మ్ము, ధైర్యం ఉన్నాయి అని కార్తీక్ వెల్ల‌డించాడు. వీళ్లిద్ద‌రూ ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్తార‌ని నాకు న‌మ్మ‌కం ఉందని, యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇస్తే వారు భవిష్యత్తులో మెరుగ్గా అడగలుగుతారని పేర్కొన్నారు.


Similar News