ముంబైకి బిగ్ షాక్.. ఐపీఎల్ 2025 కి ముందే తప్పుకోనున్నటీమిండియా మాజీ ప్లేయర్!

జహీర్ ఖాన్ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు.

Update: 2024-08-20 10:22 GMT
ముంబైకి బిగ్ షాక్.. ఐపీఎల్ 2025 కి ముందే తప్పుకోనున్నటీమిండియా మాజీ ప్లేయర్!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: జహీర్ ఖాన్ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఇప్పటివరకు మొత్తం 100 మ్యాచ్ లు ఆడి 102 వికెట్లు తీసాడు. దీని తర్వాత ఐపీఎల్ లో కోచింగ్ స్టాఫ్ గా పనిచేశాడు జహీర్ ఖాన్. ఈ టీమిండియా మాజీ ఫేసర్ లక్నో సూపర్ జెయింట్స్(LSG)కి కొత్త ఇన్నింగ్స్ ను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గౌతమ్ గంభీర్ కూడా ఆ పదవిలోనే ఉన్నాడు. ఎల్ఎస్ జీ ఫ్రాంచైజీ.. జహీర్ ఖాన్ ను మెంటార్ గా ఎంపిక చేసేందుకు ఆసక్తిని కనబరుస్తోందని సమాచారం. ఇటీవల జరిపిన కొన్ని నివేదికల ప్రకారం.. ఎల్ఎస్ జీ ఫ్రాంచైజీ జహీర్ ఖాన్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. గౌతమ్ గంభీర్ తో ఖాళీ అయిన మెంటర్ స్థానాన్ని, జహీర్ తో భర్తీ చేయనుందట. అయితే గంభీర్ ఐపీఎల్ 2022-23 లో లక్నో సూపర్ జెయింట్స్ కు మెంటర్ గా ఉన్నాడు. కానీ 2024 లో గంభీర్ లక్నో ఫ్రాంచైజీని విడిచిపెట్టి, కోల్ కతా నైట్ రైడర్స్ కు మెంటార్ గా వ్యవహరించాడు. కాగా గత సీజన్ లో లక్నోకి ఎవరూ మెంటార్ గా కనిపించలేదు. అందుకే ఈ సారి మెగా వేలానికి ముందే జహీర్ ఖాన్ ను జట్టులోకి తీసుకోవాలని LSG నిర్ణయించినట్లు సమాచారం. 

Tags:    

Similar News