కివీస్ పేసర్‌తో దురుసుగా ప్రవర్తించిన పాక్ క్రికెటర్.. ఐసీసీ భారీ షాక్
పాకిస్తాన్ ఆల్‌రౌండర్ ఖుష్‌దిల్ షాకు ఐసీసీ షాక్ ఇచ్చింది.

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ ఆల్‌రౌండర్ ఖుష్‌దిల్ షాకు ఐసీసీ షాక్ ఇచ్చింది. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు భారీ జరిమానా విధించింది. అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించినట్టు సోమవారం వెల్లడించింది. ఖుష్‌దిల్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.12 నిబంధనను ఉల్లంఘించినట్టు తెలిపింది. ఈ నిబంధన ప్రకారం.. అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆటగాళ్లను, సిబ్బందిని, మ్యాచ్ రిఫరీతోపాటు ప్రేక్షకులను అనుచిత రీతిలో తాకడం నేరం. పాక్ ఇన్నింగ్స్‌లో కివీస్ పేసర్ జకారీ ఫౌల్క్స్ బౌలింగ్‌లో పరుగు తీసే క్రమంలో ఫౌల్క్స్‌ను ఖుష్‌దిల్ బలంగా ఢీకొట్టాడు. దురుసుగా ప్రవర్తించినట్టు స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ చర్యలకు పూనుకుంది. ఖుష్‌దిల్‌కు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాగా విధించడంతోపాటు మూడు డీమెరింట్ పాయింట్స్ కేటాయించింది. తొలి టీ20లో విజయంతో కివీస్ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. నేడు రెండో టీ20 జరగనుంది.