టీమిండియా స్టార్ బౌలర్ కు బీసీసీఐ షాక్.. వార్షిక కాంట్రాక్ట్ లో పేరు గల్లంతు!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆటగాళ్లకు సంబంధించిన వార్షిక కాంట్రాక్టులను ఆదివారం ప్రకటించింది.

Update: 2023-03-27 05:05 GMT

దిశ, వెబ్ డెస్క్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆటగాళ్లకు సంబంధించిన వార్షిక కాంట్రాక్టులను ఆదివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ఈ సారి చాలా మంది సీనియర్ ప్లేయర్లకు బోర్డు భారీ షాక్ ఇచ్చింది. మరికొందరు ఆటగాళ్లు తమ ఉత్తమ ప్రదర్శన కనబరచి ప్రమోషన్ పొందారు. గత సంవత్సరం కాంట్రాక్ట్ లో సీ కేటగిరీలో చోటు దక్కించుకుని, కేవలం టెస్ట్ జట్టులో చోటు సంపాదించుకుంటున్న ఇషాంత్ శర్మను ఈ సారి కాంట్రాక్ట్‌కు దూరమమ్యాడు.

గాయం కారణంగా టీ20 జట్టులో మాత్రమే చోటు దక్కించుకున్న మరో హైదరాబాద్ సన్ రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు కాంట్రాక్ట్ లో చోటు దక్కలేదు. గాయం నుంచి కోలుకున్న తరువాత భువనేశ్వర్ కుమార్ టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన జట్టులో కూడా భువీ ఉన్నా.. నవంబర్ 2022 పర్యటన అనంతరం భువనేశ్వర్ కుమార్ ఏ మ్యాచ్ ఆడలేదు.

కానీ.. సన్ రైజర్స్ జట్టులో ఇప్పటికీ స్టార్ బౌలర్ గా అతను కొనసాగుతూనే ఉన్నాడు. ఎన్నో మ్యాచ్ లలో అద్భుత ప్రదర్శన చేసిన భువీ.. కెరీర్ క్లోజ్ అయినట్లేనంటూ క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన కనబరిస్తే.. తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి.  

Tags:    

Similar News