ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను రద్దు చేసిన బీసీసీఐ

ఐపీఎల్ 2024 లో అన్ని జట్లు ఇంపాక్ట్ ప్లేయర్ అవకాశాన్ని గట్టిగా ఉపయోగించుకొని.. కీలక మ్యాచ్ లో విజయం సాధించుకున్నాయి.

Update: 2024-10-15 02:06 GMT

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2024 లో అన్ని జట్లు ఇంపాక్ట్ ప్లేయర్ (Impact player) అవకాశాన్ని గట్టిగా ఉపయోగించుకొని.. కీలక మ్యాచ్ లో విజయం సాధించుకున్నాయి. అవసరానికి తగ్గట్టుగా, బౌలింగ్ బ్యాటింగ్ చేసేందుకు పలువురు విదేశీ ప్లేయర్లతో పాటు భారత ప్లేయర్లను ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ సువర్ణావకాశం గా మారింది. కాగా అలాంటి ఈ రూల్ ని బీసీసీఐ రద్దు చేసినట్లు ప్రకటించింది. రాబోయే సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీ కోసం వివాదాస్పద ఇంపాక్ట్ ప్లేయర్ నియమాన్ని రద్దు చేయాలని BCCI నిర్ణయించింది. కాగా ఇంపాక్ట్ ప్లేయర్ కాన్సెప్ట్ రెండు సంవత్సరాల క్రితం SMATలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు విస్తరించబడింది. IPLలో 2027 వరకు నియమాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్న కొద్దిరోజులకే ఇంపాక్ట్ ప్లేయర్‌ను తొలగించాలని BCCI నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం IPLలో రికార్డు స్థాయిలో 250 ప్లస్ టోటల్‌ను చూడడంతో, ఇంపాక్ట్ ప్లేయర్ ప్రయోగాన్ని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తో సహా పలువురు ప్రశ్నించారు. ఇది ఆల్‌రౌండర్ల అభివృద్ధిని అడ్డుకుంటున్నదని రోహిత్ భావించాడు. కానీ చాలా ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఈ నిబంధనలకు అనుకూలంగా ఉన్నాయి. కానీ తాజాగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను రద్దు చేయడాన్ని సౌరాష్ట్ర ప్రధాన కోచ్ నీరజ్ ఒడెద్రా స్వాగతించారు.


Similar News