అఫ్గాన్‌తో మిగతా సిరీస్‌కు బంగ్లా కెప్టెన్‌గా లిటాన్ దాస్..

బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ క్రికెట్‌కు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Update: 2023-07-07 13:43 GMT

ఢాకా : బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ క్రికెట్‌కు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై అతని సారథ్యంలోనే అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు బంగ్లా జట్టు ఎంపికైంది. అయితే, తొలి వన్డే ఓటమి అనంతరం తమీమ్ ఆటకు గుడ్ బై చెప్పి అందరికీ షాకిచ్చాడు. ఈ క్రమంలో అఫ్గాన్‌తో మిగతా రెండు వన్డేలకు లిటాన్ దాస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఢాకాలో శనివారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో లిటాన్ దాస్ మాట్లాడుతూ.. తమీమ్ ఇక్బాల్ నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాడు.

‘తమీమ్ ఇక్బాల్ చాలా సంవత్సరాల పాటు జట్టుకు ఎంతో చేశాడు. జట్టును నడపించాడు. అతని నిర్ణయాన్ని మేమంతా గౌరవిస్తాం. కొత్త వాళ్లు వస్తూనే ఉంటారు. ఏదో ఒకరోజు మనం వెళ్తూనే ఉంటాం.’ అని తెలిపాడు. కాగా, తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. అఫ్గాన్‌తో నేడు రెండో వన్డే జరగనుంది.


Similar News