Asian Games-2023: స్టీపుల్‌చేజ్‌లో భారత్‌కు ఒకే రోజు మూడు పతకాలు..

చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాల జోరు కొనసాగుతున్నది.

Update: 2023-10-02 13:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాల జోరు కొనసాగుతున్నది. సోమవారం 3000 మీటర్ల స్టీపుల్‌ చేజ్‌ విభాగంలో భారత్‌కు మూడు పతకాలు దక్కాయి. మెన్స్‌ 3000 మీటర్స్‌ స్టీపుల్‌ చేజ్‌లో అవినాష్‌ సాబిల్‌ గోల్డ్ పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ చేజ్‌ విభాగంలో బంగారు పతకం నెగ్గిన తొలి వ్యక్తిగా అవినాష్‌ రికార్డ్ సృష్టించాడు.

అలాగే మహళల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్‌ ఈవెంట్‌లో బంగారు పతకం చేజారిపోయింది కానీ రజత, కాంస్య పతకాలు భారత్‌కే దక్కాయి. బహ్రెయిన్‌కు చెందిన విన్‌ఫ్రెడ్‌ యావి 9 నిమిషాల 18.28 సెకన్‌లలో రేసును పూర్తి చేసి గోల్డ్‌ మెడల్ ఎగరేసుకు పోగా, భారత్‌కు చెందిన పారుల్‌ చౌదరి 9 నిమిషాల 27.63 సెకన్‌ల టైమింగ్‌తో రజతం, ప్రీతి 9 నిమిషాల 43.22 సెకన్‌ల టైమింగ్‌తో కాంస్యం దక్కించుకున్నారు.


Similar News