ఆ విషయంలో ప్రపంచంలోనే రోహిత్ శర్మను మించినోడు లేదు.. ఆసీస్ బౌలర్ ప్రశంసలు
క్రికెట్ ఫ్యాన్స్‌కు టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్(Rohit Sharma) శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.
దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ ఫ్యాన్స్‌కు టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్(Rohit Sharma) శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇటీవల జట్టుకు టీ20 ప్రపంచకప్ అందించి.. ఎన్నో ఏళ్ల కల నెరవేర్చారు. ప్రస్తుతం బంగ్లాదేశ్(Bangladesh)తో భారత్(India) వేదికగా టెస్టు సిరీస్ ఆడుతున్నారు. ఇదిలా ఉండగా.. రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా(Australia) పేసర్ హెజిల్ వుడ్(HazelWood) ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే విషయంలో, అదే ఫాస్ట్ బౌలింగ్‌లో బౌన్సర్లను ఎదుర్కొనే విషయంలో రోహిత్ శర్మకు ఎవరూ సాటిలేరు అని అన్నారు.
ఆ బాల్స్ ఆయన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టబోవని తెలిపారు. వేగంగా వచ్చే బంతుల్ని క్షుణ్ణంగా చదవి, సునాయాసంగా ఎదుర్కుంటారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రోహిత్‌కు బౌలింగ్ చేయడం చాలా కష్టతరమైన విషయమని అన్నారు. మరోవైపు.. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన భారత్ ఫుల్ జోష్‌లో ఉంది. తమను ఓడిస్తామంటూ సిరీస్‌కు ముందు ఓవరాక్షన్ చేసిన షంటో సేనను మూడు చెరువుల నీళ్లు తాగించింది. ఈ క్రమంలోనే రెండో టెస్ట్‌లోనూ నెగ్గి బంగ్లాను వైట్‌వాష్ చేయాలని డిసైడ్ అయింది.