జాక్ పాట్ కొట్టిన అర్షదీప్.. మెగా వేలంలో భారీ ధరకు అమ్ముడు

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ మెగా వేలం(IPL Mega Auction) దుబాయ్ వేదికగా ప్రారంభం అయింది.

Update: 2024-11-24 10:50 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ మెగా వేలం(IPL Mega Auction) దుబాయ్ వేదికగా ప్రారంభం అయింది. మొట్టమొదట బౌలర్ అర్షదీప్ సింగ్(Bowler Arshadeep Singh) వేలం ప్రారంభం కాగా.. అతన్ని తీసుకునేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్(SRH), పంజాబ్ కింగ్స్(Punjab kings) నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో 15. 75 కోట్లకు హైదరాబాద్ వేలంలో దక్కించుకోగా.. పంజాబ్ జట్టు అతన్ని రూ. 18 కోట్లకు రైట్ టు మ్యాచ్ పద్ధతి(RTM) ద్వారా తిరిగి అర్షదీప్ సింగ్‌ను సొంతం చేసుకొంది. దీంతో అర్షదీప్ సింగ్ 18 కోట్లకు అమ్ముడుపోయి జాక్ పాట్ కొట్టాడు. ఈ మెగా వేలంలో మొత్తం 500 లకు పైగా ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. ఇవాళ రేపు రెండు రోజుల పాటు ఈ మెగా వేలం కొనసాగనుంది. ఈ రోజు జరిగే వేలంలో అధికంగా భారత ప్లేయర్లు లిస్టులో ఉన్నట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News