IPL: మెగా వేలంలో చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర
ఐపీఎల్ మెగా వేలం(IPL Mega Auction).. దుబాయ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభం అయ్యింది.
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ మెగా వేలం(IPL Mega Auction).. దుబాయ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. ఈ వేలం కోసం భారత్ తో పాటు ఇతర దేశాల ప్లేయర్లు, క్రికెట్ అభిమానులు.. ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వెేలంలోకి భారత్ స్టార్ ప్లేయర్, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) వేలంలోకి వచ్చారు. ఈ క్రమలో ఆయన్ను దక్కించుకునేందుకు ఢిల్లీ(Delhi), పంజాబ్(Punjab) జట్లు పోటీ పడ్డాయి. రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ ను అందరూ ఊహించినట్లుగానే పంజాబ్ కింగ్స్ జట్టు.. రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో యువ బ్యాటర్ అయిన శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర (Highest cost in IPL history)కు అమ్ముడు పోయిన ప్లేయర్ గా నిలిచాడు. అలాగే ఇప్పటి వరకు ఐపీఎల్ లో అత్యధిక ధరకు అమ్ముడు పోయిన భారత ఆటగాడిగా కూడా శ్రేయస్ అయ్యర్ చరిత్రలోకి ఎక్కాడు.