Commonwealth Games 2026: కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహించడం మా వల్ల కాదు.. Australia

కామన్‌వెల్త్ గేమ్స్ 2026 ఎడిషన్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.

Update: 2023-07-18 13:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: కామన్‌వెల్త్ గేమ్స్ 2026 ఎడిషన్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కామన్వెల్త్ గేమ్స్ 2026 నిర్వహణ తమ నుంచి కాదని ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. విక్టోరియా స్టేట్‌లో ఈ టోర్నీ నిర్వహించాలి. కానీ కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించే బడ్జెట్ తమ వద్ద లేదని విక్టోరియా రాష్ట్రం స్పష్టం చేసింది. అనుకున్నదాని కంటే బడ్జెట్ చాలా ఎక్కువైందని, ప్రస్తుత పరిస్థితుల్లో అంతటి బడ్జెట్‌తో కామన్వెల్త్ గేమ్స్‌ను నిర్వహించలేమని చెప్పింది. గేమ్స్ నిర్వహణ నుంచి తప్పుకుంటున్నట్లు కామన్‌వెల్త్ గేమ్స్ అథారిటీకి సమాచారమిచ్చినట్లు విక్టోరియా ప్రభుత్వ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. తమ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని కూడా కోరినట్లు చెప్పారు.

'ముందుగా కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు బడ్జెట్‌లో రెండు ఆస్ట్రేలియాన్ బిలియన్ డాలర్స్ కేటాయించాం. కానీ ఇప్పుడు చూస్తే అది ఏడు ఆస్ట్రేలియన్ బిలియన్ డాలర్లకు చేరింది. ప్రస్తుత పరిస్థితుల్లో అంత మొత్తం ఖర్చు చేయడం మా స్టేట్ నుంచి కాదు. అసలే లోటు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని నెట్టుకు వస్తున్నాం. కామన్వెల్త్ నిర్వహణ మాకు భారంగా మారే అవకాశం ఉంది. ఆసుపత్రి, స్కూల్ నిర్వహణకు ఖర్చు చేయాల్సిన దానిని ఇలా కామన్వెల్త్ గేమ్స్‌కు ఖర్చు చేయలేం.'అని విక్టోరియా స్టేట్ డానియల్ ఆండ్రూస్ మెల్‌బోర్న్ అన్నారు. గతేడాది ఇంగ్లండ్‌లోని బర్మింగ్ హోమ్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ 2022 జరిగాయి. ఈ గేమ్స్‌లో ఆసీస్ 179 పతకాలతో టాప్‌లో ఉండగా.. రెండో స్థానంలో ఇంగ్లండ్ 176 పతకాలతో ఉంది. ఇక భారత్ ఈ గేమ్స్‌లో 61 పతకాలు(22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో) నాలుగో స్థానంలో నిలిచింది.


Similar News