ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా టాప్.. టీమిండియా ప్లేస్ ఎంతంటే?

Update: 2023-09-10 09:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ ఆదివారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో.. ఆస్ట్రేలియా టాప్‌లోకి దూసుకెళ్లింది. 121 పాయింట్లతో ఆసిస్.. పాకిస్థాన్​(120 పాయింట్ల)ను వెనక్కినెట్టి అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. ఇక 114 పాయింట్లతో భారత్.. మూడో స్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాతో 5 టీ20 సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో విజయం సాధించిన ఆసీస్‌.. పాకిస్తాన్‌ను వెనక్కి నెట్టి టాప్‌ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. కాగా, ఆసియాకప్‌ సూపర్‌-4లో భాగంగా భారత్‌-పాక్‌ మధ్య మ్యాచ్‌ ఆదివారం జరగనుండడంతో మళ్లీ ర్యాంక్‌లు తారుమారు అయ్యే ఛాన్స్‌ ఉంది.

గతేడాది శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన ఆసీస్​.. ఆ తర్వాత వేగం పుంజుకుంది. అసాధారణ ఆటతీరుతో ఆ తర్వాత సొంత గడ్డపై.. న్యూజిలాండ్ (3-0), ఇంగ్లాండ్​ (3-0)ను క్లీన్​స్వీప్​ చేసింది. ఈ ఏడాది భారత్ పర్యటనలో కూడా 2-1 తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న ఆసిస్.. తాజాగా రెండు వరుస విజయాలు నమోదు చేసి.. నెం 1 జట్టుగా నిలిచింది. అయితే రెండో ప్లేస్‌లో ఉన్న పాకిస్థాన్.. ఆసియాకప్‌లో ఇంకా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. దీంతో మళ్లీ ర్యాంక్ మారే అవకాశాలు ఉన్నాయి.

టాప్-5లో ఉన్న జట్లు..

రెండో స్థానం.. పాకిస్థాన్ 120 పాయింట్లు

మూడో స్థానం.. భారత్ 114 పాయింట్లు

నాలుగో స్థానం. న్యూజిలాండ్ 106 పాయింట్లు

ఐదో స్థానం.. ఇంగ్లాండ్ 99 పాయింట్లు


Similar News