చరిత్ర సృష్టించిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్
భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించింది. ఉ
దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించింది. ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతున్న ఆసియా జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం కొల్లగొట్టింది. దీంతో ఈ టోర్నీ చరిత్రలో ఏ ఈవెంట్‌లోనైనా గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా దీప రికార్డుకెక్కింది. ఆదివారం జరిగిన మహిళల వాల్ట్ ఈవెంట్ ఫైనల్‌లో దీప 13.566 స్కోరుతో విజేతగా నిలిచింది. నార్త్ కొరియాకు చెందిన కిమ్ సన్ హ్యాంగ్(13.466), జో క్యోంగ్ బైయోల్(12.966) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. గతంలో ఈ టోర్నీలో భారత అథ్లెట్లు నాలుగు పతకాలు గెలుచుకున్నా.. అవన్నీ కాంస్య పతకాలే. 2015లో దీప ఇదే ఈవెంట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించింది. ఆమెతోపాటు 2006లో ఆశిశ్ కుమార్(మెన్స్ ఫ్లోర్ ఎక్స్‌ర్‌సైజ్), 2019, 2022లలో ప్రణతి నాయక్(ఉమెన్స్ వాల్ట్) కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఈ టోర్నీలో భారత్‌కు దీప తొలి గోల్డ్ మెడల్ అందించి కొత్త చర్రిత లిఖించింది.