Asian Games 2023: ఈక్వెస్ట్రియన్‌లో మరో పతకం.. చరిత్ర సృష్టించిన అనుష్‌

Update: 2023-09-28 11:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: Asian Games 2023లో ఈక్వెస్ట్రియన్‌ విభాగంలలో భారత్‌కు మరో పతకం దక్కింది. వ్యక్తిగత డ్రెస్సేజ్‌ విభాగంలో అనుష్ గార్వాలా కాంస్య పతకంతో చరిత్ర సృష్టించాడు. ఆసియా క్రీడల్లో వ్యక్తిగత డ్రస్సేజ్ ఈవెంట్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఈక్వెస్ట్రియన్‌లో ఇప్పటికే భారత్‌ బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే. సుదీప్తి హజెలా, హృదయ్ విపుల్, అనూష్ గార్వాలా, దివ్యకృతి సింగ్‌లతో కూడిన భారత బృందం ఈక్వస్ట్రియన్‌లో డ్రస్సేజ్ ఈవెంట్‌లో గెలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నారు.

Similar News