Asian Games-2023: భారత్ ఖాతాలో మరో పతకం.. మహిళల లాంగ్‌ జంప్‌లో రజతం..

ఆసియా క్రీడల్లో మరో పతకం భారత్‌ ఖాతాలో చేరింది.

Update: 2023-10-02 14:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా క్రీడల్లో మరో పతకం భారత్‌ ఖాతాలో చేరింది. మహిళల లాంగ్‌ జంప్‌ విభాగం ఫైనల్లో భారత అథ్లెట్‌ అన్షీ సింగ్‌ 6.63 మీటర్ల దూరం లాంగ్ జంప్ చేయడం ద్వారా రెండో స్థానంలో నిలిచి రజత పతకం నెగ్గింది. ఈ విభాగంలో బంగారు పతకం గెలుచుకున్న చైనా అథ్లెట్‌ క్సియాంగ్‌ షికి కంటే కేవలం 0.10 మీటర్లు మాత్రమే అన్షీ వెనుకబడింది. క్సియాంగ్‌ 6.73 మీటర్ల దూరం దునికి అగ్ర స్థానం దక్కించుకుంది. ఇదే ఈవెంట్‌లో మరో భారత అథ్లెట్ సింగ్ శైలి 6.48 మీటర్లు లాంగ్ జంప్ చేయడంతో 5వ ప్లేస్‌లో నిలిచింది. ఈ పతకంతో ఇండియా మొత్తం పతకాల సంఖ్య 50 దాటింది. పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది.


Similar News