IND vs BAN 1st Test : హాఫ్ సెంచరీలతో ఆదుకున్న అశ్విన్..జడేజా

బంగ్లాదేశ్ తో మెుదలైన తొలి టెస్టులో టీమిండియా ప్రధాన బ్యాటర్లు త్వరగా అవుటైనప్పటికి ఆల్ రౌండర్లు అశ్విన్(76)..జడేజా(56)లు విలువైన హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు.

Update: 2024-09-19 11:06 GMT

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ తో మెుదలైన తొలి టెస్టులో టీమిండియా ప్రధాన బ్యాటర్లు త్వరగా అవుటైనప్పటికి ఆల్ రౌండర్లు అశ్విన్(76)..జడేజా(56)లు విలువైన హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఈ జంట జట్టు స్కోర్ ను 270పరుగులు దాటించి తమ ఆట కొనసాగిస్తున్నారు. టాస్ ఓడిపోవడంతో మొదట బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా రెండో సెషన్ ముగిసే సమయానికి 48ఓవర్లకు 176పరుగులకే ఓపెనర్లు రోహిత్ శర్మ(6), శుభమన్ గిల్(0) సహా విరాట్ కోహ్లీ(6), రిషబ్ పంత్(39) వికెట్లను కోల్పయింది. యువ పేసర్ హసన్ మహ్మద్ దెబ్బకు తొలి నలుగురు ఆటగాళ్లు పెవిలియన్ చేరారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్ల పతనాన్ని అడ్దుకున్నప్పటికి చివరకు( 56)పరుగులకు అతను, కేఎల్ రాహుల్ (16)పరుగులకు ఔటయ్యారు. బంగ్లా బౌలర్లలో నహిద్ రాణా, మెహిద్ హసన్ మిరాజ్ లు చెరో వికెట్ తీశారు. అశ్విన్..జడేజా సహా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఎన్ని పరుగులు చేస్తారన్నదానిపైనే టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోర్ ఆధారపడనుంది.


Similar News