Ashes 4th Test: వార్నర్‌కు కెప్టెన్‌ మద్దతు.. ఆసీస్‌ తుది జట్టుపై క్లారిటీ

మాంచెస్టర్‌ వేదికగా జులై 19 నుంచి ప్రారంభంకానున్న యాషెస్‌ సిరీస్‌ నాలుగో టెస్ట్‌ కోసం ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు తుది జట్టును నిన్ననే ప్రకటించిన విషయం తెలిసిందే.

Update: 2023-07-18 14:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాంచెస్టర్‌ వేదికగా జులై 19 నుంచి ప్రారంభంకానున్న యాషెస్‌ సిరీస్‌ నాలుగో టెస్ట్‌ కోసం ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు తుది జట్టును నిన్ననే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ కేవలం లీకులు ఇచ్చాడు. తొలి 3 టెస్ట్‌ల్లో విఫలమైన వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు కమిన్స్‌ అండగా నిలిచాడు. వార్నర్‌ కీలకమైన నాలుగో టెస్ట్‌లో ఆడతాడని చెప్పాడు. వార్నర్‌ గతంలో చాలా సందర్భాల్లో కీలక సమయాల్లో ఫామ్‌ను అందుకని తమను గెలిపించాడని ప్రీ మ్యాచ్‌ మీడియా కాన్ఫరెన్స్‌లో ప్రస్తావించాడు.

దీన్ని బట్టి చూస్తే నాలుగో టెస్ట్‌ కోసం వార్నర్‌కు లైన్‌ క్లియర్‌ అయింది. ఈ నేపథ్యంలో తుది జట్టులో ఓ మార్పు విషయంపై కూడా కమిన్స్‌ నోరు విప్పాడు. మూడో టెస్ట్‌లో ఆశించినంత ప్రభావం చూపని స్కాట్‌ బోలండ్‌ స్థానాన్ని హాజిల్‌వుడ్‌ భర్తీ చేస్తాడని తెలిపాడు. తుది జట్టు ప్రకటనపై తొందరేం లేదని, మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు ఆ ప్రకటన ఉంటుందని కాన్ఫరెన్స్‌ను కంక్లూడ్‌ చేశాడు. ఐదు మ్యాచ్‌ల యాషెస్‌ సిరీస్‌లో పర్యాటక ఆసీస్‌ ప్రస్తుతానికి 2-1 ఆధిక్యంలో ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్‌ గెలువగా.. హోరాహోరీగా సాగిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించింది.


Similar News