Ashes Series 3rd Test Day 4: హోరాహోరీగా సాగుతున్న యాషెస్‌ టెస్ట్‌..

Ashes Series 3rd Test హోరాహోరీగా సాగుతుంది.

Update: 2023-07-09 12:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: Ashes Series 3rd Test హోరాహోరీగా సాగుతుంది. నాలుగో రోజు 251 పరుగుల లక్ష్యఛేదనలో 27/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌.. తొలి సెషన్‌లోనే 3 వికెట్లు కోల్పోయింది. అయినా ఆ జట్టుకే విజయావకాశాలు ఉన్నాయి. ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో 15 పరుగులు జోడించిన అనంతరం మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో బెన్‌ డకెట్‌ (23) ఎల్బీడబ్ల్యూ కాగా.. ఆ తర్వాత 60 పరుగుల వద్ద మొయిన్‌ అలీ (5)ని క్లీన్‌బౌల్డ్‌ చేశాడు స్టార్క్‌. అప్పటికే క్రీజ్‌లో కుదురుకున్న జాక్‌ క్రాలే (44)ను 93 పరుగుల వద్ద మిచెల్‌ మార్ష్‌ పెవిలియన్‌కు పంపాడు.

ఇంగ్లండ్‌.. 26 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 120 పరుగుల చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. జో రూట్‌ (16), హ్యారీ​ బ్రూక్‌ (22) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ గెలవాలంటే మరో 131 పరుగులు అవసరం కాగా.. ఆసీస్‌ గెలుపుకు 7 వికెట్లు అవసరం.


Similar News