తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ.. సచిన్ తనయుడు Arjun Tendulkar రికార్డు..

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లోనే సెంచరీ బాది.. సచిన్‌ లాగే ఆడిన తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లోనే సెంచరీ చేశాడు.

Update: 2022-12-14 12:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లోనే సెంచరీ బాది.. సచిన్‌ లాగే ఆడిన తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లోనే సెంచరీ చేశాడు. సచిన్‌ టెండూల్కర్‌ 1988లో గుజరాత్‌పై ఈ ఘనత సాధించాడు. గోవా తరఫున బరిలోకి దిగిన అర్జున్‌.. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. గోవా జట్టు 78.1 ఓవర్లలో గోవా 4 వికెట్లకు 196 రన్స్‌ దగ్గర ఉన్నప్పుడు అర్జున్‌ క్రీజులో అడుగుపెట్టగా.. రెండో రోజు తన తొలి సెంచరీ (207 బంతుల్లో 120 పరుగులు) చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అర్జున్‌ ఏకంగా మూడంకెల స్కోరు అందుకోవడం విశేషం.

Tags:    

Similar News