పారా ఒలంపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

పారిస్ వేదికగా జరుగుతోన్న పారా ఒలంపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. పురుషుల జావెలిన్ ఎఫ్‌-41లో నవదీప్‌ సాధించారు.

Update: 2024-09-08 01:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: పారిస్ వేదికగా జరుగుతోన్న పారా ఒలంపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. పురుషుల జావెలిన్ ఎఫ్‌-41లో నవదీప్‌ సాధించారు. ఈ పోటీలో నవదీప్ 47.32 మీటర్లు విసిరి రికార్డు సృష్టించారు. జావెలిన్ ఎఫ్‌-41లో స్వర్ణం సాధించిన ఏకైక భారత అథ్లెట్‌గా నవదీప్ అరుదైన ఘనత సాధించారు. తొలుత రజతం సాధించిన నవదీప్.. ఇరాన్ అథ్లెట్‌పై అనర్హత వేటు వేయడంతో స్వర్ణం గెలిచాడు. ప్రస్తుతం పతకాల పట్టికలో 29 పథకాలతో భారత్‌ 16వ స్థానంలో కొనసాగుతోంది.

మొత్తంగా భారత్ ఖాతాలో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ నుంచి పారా ఒలంపిక్స్‌లో పాల్గొన్న యువ క్రీడాకారిణి దీప్తి జివాంజీ కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈమెను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అథ్లెట్ దీప్తిని మరింత ప్రోత్సహించేందుకు గ్రూప్-2 ఉద్యోగంతోపాటు రూ.కోటి నగదు బహుమతిని అందజేశారు. దీంతోపాటు వరంగల్‌లో 500 గజాల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. ఇక‌ దీప్తి జివాంజీ కోచ్ రమేష్‌కు రూ.10 లక్షలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.


Similar News