భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్‌గా సంతోష్ కశ్యప్

భారత సీనియర్ మహిళల ఫుట్‌బాల్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ వచ్చాడు.

Update: 2024-09-16 19:20 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత సీనియర్ మహిళల ఫుట్‌బాల్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ వచ్చాడు. భారత మాజీ ఫుట్‌బాలర్ సంతోష్ కశ్యప్‌ను ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్) సోమవారం ప్రధాన కోచ్‌గా నియమించింది. పీవీ ప్రియ అసిస్టెంట్ కోచ్‌గా, రఘువీర్ ప్రవీణ్ గోల్ కీపర్ కోచ్‌గా ఉండనున్నారు. నేపాల్‌లో వచ్చే నెలలో జరిగే శాఫ్ చాంపియన్‌షిప్ కశ్యప్‌కు తొలి పరీక్ష. ఈ టోర్నీ కోసం 29 మందితో కూడిన భారత జట్టు ఈ నెల 20 నుంచి గోవాలో ట్రైనింగ్ క్యాంప్‌లో పాల్గొంటుంది. కశ్యప్‌కు దాదాపు 10 ఏళ్ల కోచింగ్ అనుభవం ఉంది. మోహన్ బగాన్, ఐజ్వాల్ ఎఫ్‌సి, ముంబై ఎఫ్‌సి క్లబ్‌లకు కోచ్‌గా ఉన్నాడు. నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సి, ఒడిశా ఎఫ్‌సిలకు అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరించాడు. జాతీయ జట్టుకు కోచింగ్ ఇవ్వడం ఎప్పుడూ గౌరవమేనని, ఈ సారి శాఫ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను తిరిగి దక్కించుకుంటామని సంతోష్ కశ్యప్ తెలిపాడు.


Similar News