Asian Champions Trophy: భారత్-చైనా మధ్య ఫైనల్..చైనాకు మద్దతిచ్చిన పాక్ ఆటగాళ్లు

చైనా(China)లోని హులున్‌బుయిర్‌(Hulunbuir) వేదిక‌గా నిన్న జ‌రిగిన ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ(Asian Champions Trophy) ఫైనల్ లో భార‌త్(India) ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

Update: 2024-09-18 00:10 GMT

దిశ, వెబ్‌డెస్క్:చైనా(China)లోని హులున్‌బుయిర్‌(Hulunbuir) వేదిక‌గా నిన్న జ‌రిగిన ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ(Asian Champions Trophy) ఫైనల్ లో భార‌త్(India) ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆతిథ్య చైనా పై 1-0 తేడాతో భార‌త్ గెలుపొందింది. రికార్డు స్థాయిలో ఐదోసారి ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ టైటిల్ ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.దీంతో మొదటిసారి ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ నెగ్గాలని భావించిన చైనాకు గ‌ట్టి షాక్ త‌గిలింది. భార‌త్ త‌రుపున నమోదైన ఏకైక గోల్‌ను జుగ్రాజ్ సింగ్(Jugraj Singh) 51వ నిమిషంలో న‌మోదు చేశాడు. 7 మ్యాచుల్లో 7 గోల్స్ సాధించిన భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్(Harmanpreet Singh) కు ప్లేయర్ అఫ్ ద టోర్నీ(Player Of The టోర్నీ) అవార్డు లభించింది.మ‌రోవైపు మూడోస్థానం కోసం జ‌రిగిన ప్లేఆఫ్‌లో ద‌క్షిణ‌కొరియా(South Korea)ను పాకిస్థాన్(Pakistan) 5-2 తేడాతో ఓడించింది.

ఇదిలా ఉంటే..ఏషియన్ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు చైనాకు మ‌ద్ద‌తు తెలిపారు.పాక్ ఆట‌గాళ్లు చైనాకు మ‌ద్ద‌తుగా చైనా జెండాల‌ను ప‌ట్టుకుని కూర్చున్న దృశ్యాలు టీవీల్లో ప్రసారమయ్యాయి. దీంతో వారు ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తున్నారో స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంద‌ని మ్యాచ్ జరిగే టైంలో కామెంటేటర్ వ్యాఖ్యానించారు.అయితే పాక్‌ సెమీఫైనల్లో ఎవ‌రి చేతిలో అయితే ఓట‌మిపాలైందో వారికే సపోర్ట్ చేయడం గ‌మ‌నార్హం.పాక్ ఆటగాళ్లు చైనా జాతీయ జెండాలు పట్టుకున్న వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.


Similar News