భారత్‌ను ఫాలో-ఆన్ నుంచి తప్పించిన ఆకాష్ దీప్.. డ్రెసింగ్ రూమ్‌లో కోహ్లీ రియాక్షన్ వైరల్
భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో.. ఓ వైపు ఆస్ట్రేలియా జట్టు, మరోవైపు వర్షం పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించాయి.
దిశ, వెబ్ డెస్క్: భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు(Third test)లో.. ఓ వైపు ఆస్ట్రేలియా(Australia) జట్టు, మరోవైపు వర్షం పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించాయి.అయితే 200 పరగులకు కీలక వికెట్లు కోల్పోయిన భారత్ ఓ దశలో ఫాలో-ఆన్(Follow-on) ప్రమాదంలో పడింది. ఈ క్రమంలో 10వ వికెట్ కు బ్యాటింగ్ కు వచ్చిన ఆకాష్ దీప్ ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో 74వ ఓవర్లో 2వ బంతికి ఫోర్ కొట్టడంతో భారత్ 246 పరుగులకు చేరుకొని ఫాలో ఆన్ నుంచి తప్పించుకుంది. ఈ క్రమంలో డ్రెస్సింగ్ రూమ్ లో ఉత్సాహం నెలకొంది. అనంతరం అదే ఓవర్లో నాలుగో బంతికి ఆకాష్ దీప్(Akash Deep) భారీ సిక్సర్ కొట్టాడు. ఆ బంతి ఆకాశంలోకి ఎగిరి ప్రేక్షకుల గ్యాలరీలో పడింది. ఆ సిక్సును చూసి కోహ్లీ(Kohli) ఆశ్చర్య పోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా నాలుగో రోజు ఆట వెలుతురు సరిగ్గా లేకపోవడంతో మ్యాచును నిలిపివేశారు. కాగా ఈ మ్యాచుల్ భారత్ 193 పరుగుల వెనుకంజలో ఉండగా.. ప్రస్తుతం క్రీజులో ఆకాష్ దీప్ 27, బుమ్రా 17 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు.