వృద్ధాప్యంలో మన క్రికెటర్లు.. ఏఐ ఆర్టిస్ట్ సృజనాత్మక చిత్రాలు

ఆర్టిఫిషిల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆర్ట్ ఇంటర్నెట్‌ను కుదిపేస్తోందన్న విషయాన్ని కాదనలేం.

Update: 2023-05-08 16:41 GMT

న్యూఢిల్లీ: ఆర్టిఫిషిల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆర్ట్ ఇంటర్నెట్‌ను కుదిపేస్తోందన్న విషయాన్ని కాదనలేం. ఇది ఆర్టిస్ట్‌ల ఊహలకు రెక్కలనిచ్చింది. మిడ్‌జర్నీ వంటి యాప్‌లతో రూపొందిస్తున్న కొన్ని సృజనాత్మక చిత్రాలను ఇప్పుడు ఇంటర్నెట్‌లో ప్రతి రోజు చూడవచ్చు. ఎస్‌కే ఎండీ అబు షాహిద్ అనే అర్టిస్ట్ మిడ్‌జర్నీ యాప్‌ను ఉపయోగించి మన క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ వృద్ధాప్యంలో ఎలా ఉంటారో చూపించారు.

ఈ చిత్రాలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. ఇంకా సచిన్ టెండూల్కర్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, చెటేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజాల చిత్రాలు కూడా ఉన్నాయి.

Tags:    

Similar News