అందుకే అతనికి వరుస అవకాశాలు.. భారత ఓపెనర్‌‌కు అండగా నిలిచిన ఆకాశ్ చోప్రా

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే.

Update: 2023-02-21 11:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. మూడు ఇన్నింగ్స్‌ల్లో 20, 17, 1 పరుగులే చేశాడు. ఫామ్‌తో సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాహుల్‌కు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అండగా నిలిచాడు. విదేశాల్లో కేఎల్ రాహుల్‌కు మెరుగైన గణంకాలండటంతోనే టీమ్‌ మేనేజ్‌మెంట్‌గా అండగా నిలుస్తుందని చెప్పాడు. అయితే సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను కాదని.. ఫామ్‌తో సతమతమవుతున్న రాహుల్‌ను ఆడించడం ఏంటని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయంలో మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ విమర్శలు చేశాడు. ఈ విమర్శలకు ఆకాశ్ చోప్రా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. రాహుల్‌కు అండగా నిలుస్తూ.. సేనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) కేఎల్ రాహుల్ చేసిన పరుగల గణంకాలను తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఈ ప్రదర్శన కారణంగానే భారత సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ రాహుల్‌కు మద్దతుగా నిలుస్తున్నారని వెల్లడించారు.

Tags:    

Similar News