IPL మాక్ వేలంలో రిషబ్ పంత్‌కు 33 కోట్లు.. ఏ జట్టు కొన్నదంటే..?

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన టోర్నీలలో ఐపీఎల్(IPL) ముందు వరుసలో ఉంటుంది.

Update: 2024-11-23 14:19 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన టోర్నీలలో ఐపీఎల్(IPL) ముందు వరుసలో ఉంటుంది. ఐపీఎల్ లో భారత్ తో పాటు.. ఇతర దేశాల్లోని స్టార్ క్రికెటర్లు సత్తా చాటుతుండటంతో.. మరింత క్రేజ్ పెరిగింది. ఇప్పటి వరకు 17 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ ప్రతిష్టాత్మక టోర్ని.. 18వ సీజన్ కు సన్నద్ధం అవుతుంది. ఇందులో భాగంగా.. మెగా వేలానికి ముందు ఆయా జట్లు.. కీలక ప్లేయర్లను రిటైన్ చేసుకొని.. మరికొంత మందిని విడుదల చేసింది. దీంతో యావత్ ప్రపంచం దృష్టి.. రేపు జరగబోయే మెగా వేలం(Mega Auction)పై ఉంది. ఈ మెగా వేలంలో స్టార్ ప్లేయర్లు ఉండటంతో ఎవరిని ఏ జట్టు.. ఎంతకు కొనుగోలు చేస్తుందనే.. ఉత్కంఠ ప్రేక్షకులు, అభిమానుల్లో నెలకొంది. దీంతో శనివారం జియో సినిమా ఛానల్(Jio movie channel) వారు.. రేపు జరగబోయే మెగా వేలం మాదిరిగానే ఐపీఎల్ మాక్ వేలం(IPL Mock Auction) నిర్వహించారు.

ఇందులో ఆయా జట్లకు మెంటర్లుగా, బ్యాటింగ్ కోచులుగా, కెప్టెన్లుగా వ్యవహరించిన సీనియర్ ప్లేయర్లు పాల్గొన్నారు. సరదాగా నవ్వుతూ సాగిన ఈ జియో సినిమా మాక్ వేలంలో.. భారత స్టార్ ప్లేయర్ అయిన రిషబ్ పంత్(Rishabh Pant).. ను ఏకంగా పంజాబ్ కింగ్స్(Punjab Kings) రూ. 33 కోట్లకు కొనుగోలు చేసింది. ఇదే కనుక నిజమైతే.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పంత్ నిలువనున్నాడు. ఇదే మాక్ వేలంలో ఇతర భారత ప్లేయర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. లక్నో వదిలేసిన కేఎల్ రాహుల్(KL Rahul)ను.. 29.5 కోట్లకు ఆర్సీబీ(RCB) కొనుగోలు చేసింది. అలాగే శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను. 21 కోట్లకు మళ్లీ కేకేఆర్(KKR) కొనుగోలు చేయగా.. మిచెల్ స్టార్క్ ను ముంబై జట్టు 18 కోట్లకు, ఇషాన్ కిషన్ ను ఢిల్లీ 15.5 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే భారత స్టార్ బౌలర్ అయిన చాహల్(Chahal) ను రూ 15 కోట్లకు SRH, డికాక్ ను 6.5 కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది. కాగా ఇదంతా.. మాక్ వేలం అయినప్పటికి రేపు జరిగే నిజమైన వేలంలో కూడా ఇదే రిపీట్ అవుతుందని.. సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News