యోగా, జిమ్ సెంటర్లలో వీరికి మాత్రమే అనుమతి
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ సడలింపులో భాగంగా అన్‌లాక్ 3.O అమలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇందులో భాగంగానే జిమ్, యోగా సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. కాగా, వీటిని తెరిచేందుకు తాజాగా ప్రత్యేక మార్గదర్శకాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఆగస్టు 5 నుంచి యోగా, జిమ్ సెంటర్లు ఓపెన్ కానున్నాయి. అయితే, కంటైన్‌మెంట్ జోన్లు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో.. జిమ్‌లు, యోగా సెంటర్లను తెరిచేందుకు కేంద్రం అనుమతి […]
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ సడలింపులో భాగంగా అన్‌లాక్ 3.O అమలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇందులో భాగంగానే జిమ్, యోగా సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. కాగా, వీటిని తెరిచేందుకు తాజాగా ప్రత్యేక మార్గదర్శకాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసింది.
దేశ వ్యాప్తంగా ఆగస్టు 5 నుంచి యోగా, జిమ్ సెంటర్లు ఓపెన్ కానున్నాయి. అయితే, కంటైన్‌మెంట్ జోన్లు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో.. జిమ్‌లు, యోగా సెంటర్లను తెరిచేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 65 ఏళ్ల పైబడిన వారికి, గర్భిణీలకు, 10 ఏళ్ల లోపు చిన్నారులకు అనుమతి నిరాకరించారు. ముఖ్యంగా మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ వర్క్ అవుట్స్ చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే, ప్రతి సెంటర్‌లో తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు, భౌతిక దూరం పాటించేలా నిర్వాహకులు ఏర్పాటు చేయాలని సూచనలు చేసింది.