జీహెచ్ఎంసీలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ !

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీలో ఈనెల 4నుంచి 10వరకు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించించింది. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సీఎస్ సోమేశ్ కుమార్ ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించి.. కొవిడ్ కేసుల పెరుగుదల, వర్షాల తర్వాత అంటు వ్యాధులు ప్రబలే అంశాలపై చర్చించారు. నగరంలో చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. దోమల లార్వా వృద్ధి చెందకుండా క్రిమి సంహారక మందు పిచికారి చేయాలని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 199 […]

Update: 2020-11-01 08:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీలో ఈనెల 4నుంచి 10వరకు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించించింది. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సీఎస్ సోమేశ్ కుమార్ ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించి.. కొవిడ్ కేసుల పెరుగుదల, వర్షాల తర్వాత అంటు వ్యాధులు ప్రబలే అంశాలపై చర్చించారు. నగరంలో చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. దోమల లార్వా వృద్ధి చెందకుండా క్రిమి సంహారక మందు పిచికారి చేయాలని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 199 బస్తీ దవాఖానాలు పనిచేస్తున్నాయని, వారంలోపు మరో 37 ప్రారంభింస్తామని తెలిపారు.

అటు.. వరద బాధిత కుటుంబాలకు నగదు పంపిణీపై పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శితో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 3.87లక్షల కుటుంబాలకు రూ.367 కోట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

Tags:    

Similar News