వైద్యారోగ్య సిబ్బందికి ప్రత్యేక హెల్ప్ డెస్క్

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా సోకిన  వైద్యారోగ్య సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు సేవలందించేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ డెస్క్ ఏర్పాటు చేసినట్టుగా వైద్యారోగ్య సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. 040-48213321 హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేస్తే కరోనా సోకిన వైద్యారోగ్య సిబ్బందిని నిరంతరం పర్యవేక్షిస్తూ వారికి అవసరమమైన చికిత్సలు అందించేందుకు సహాయపడతామన్నారు. పరిస్థితి విషమించిన వారిని ఆసుపత్రిలో చేర్పించి వారు కోలుకునే వరకు అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. 24 గంటల పాటు ఈ […]

Update: 2021-05-21 06:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా సోకిన వైద్యారోగ్య సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు సేవలందించేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ డెస్క్ ఏర్పాటు చేసినట్టుగా వైద్యారోగ్య సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. 040-48213321 హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేస్తే కరోనా సోకిన వైద్యారోగ్య సిబ్బందిని నిరంతరం పర్యవేక్షిస్తూ వారికి అవసరమమైన చికిత్సలు అందించేందుకు సహాయపడతామన్నారు. పరిస్థితి విషమించిన వారిని ఆసుపత్రిలో చేర్పించి వారు కోలుకునే వరకు అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. 24 గంటల పాటు ఈ హెల్ప్ లైన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

వైద్య సిబ్బంది ప్రాణాలు కాపాడటం కొరకు సీఎం కేసీఆర్ చేపట్టిన చొరవకు వైద్యారోగ్య సంఘాల ఐక్యవేదిక హర్షం వ్యక్తం చేసింది. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వైద్య సిబ్బంది కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించిన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాల్సిందిగా కోరారు.

Tags:    

Similar News