టీటీడీ దర్శనాలకు కరోనా బ్రేక్.. స్పెషల్ టిక్కెట్స్ కోటా తగ్గింపు!
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు గతేడాది రికార్డుకు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ ఒక్కరోజు వ్యవధిలో 7వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు జిల్లాలో రోజుకూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల దర్శనాలకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సర్వదర్శనం టిక్కెట్లను ఈనెల 12 నుంచి నిలిపివేయగా, మే నెలకు సంబంధించి ప్రత్యేక దర్శనం టిక్కెట్లను 30 వేల నుంచి 15 […]
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు గతేడాది రికార్డుకు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ ఒక్కరోజు వ్యవధిలో 7వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు జిల్లాలో రోజుకూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల దర్శనాలకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే సర్వదర్శనం టిక్కెట్లను ఈనెల 12 నుంచి నిలిపివేయగా, మే నెలకు సంబంధించి ప్రత్యేక దర్శనం టిక్కెట్లను 30 వేల నుంచి 15 వేలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 20నుంచి ఆన్‌లైన్ ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది.