మైనింగ్ అధికారులపై తమ్మినేని ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకులం జిల్లాలో ఇసుక కొరత విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్, మైనింగ్ అధికారుల తీరుపై ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇసుక కొరతకు అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణం అన్నారు. అంతేగాకుండా అధికారుల వైఖరి, ఇసుక పాలసీకి తూట్లు పొడిచేలా ఉందని వెల్లడించారు. అధికారుల తీరు వల్ల నాడు-నేడు కూడా పనులకు ఆటంకం కలుగుతోందని అన్నారు. ఇసుక దొరక్క నిర్మాణ […]
దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకులం జిల్లాలో ఇసుక కొరత విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్, మైనింగ్ అధికారుల తీరుపై ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇసుక కొరతకు అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణం అన్నారు. అంతేగాకుండా అధికారుల వైఖరి, ఇసుక పాలసీకి తూట్లు పొడిచేలా ఉందని వెల్లడించారు. అధికారుల తీరు వల్ల నాడు-నేడు కూడా పనులకు ఆటంకం కలుగుతోందని అన్నారు. ఇసుక దొరక్క నిర్మాణ రంగం కుదేలవుతోందని, కూలీలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని సూచించారు. ఈ సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు.