స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్‌తో అంతరిక్ష చెత్త క్లియర్?
దిశ, వెబ్‌డెస్క్: భూమ్మీద మానవజాతి తమ అవసరాల కోసం రోజుకో రాకెట్ ద్వారా శాటిలైట్‌లను అంతరిక్షంలోకి పంపించి.. రిమోట్ సెన్సింగ్, శాటిలైట్ టెక్నాలజీల సాయంతో అభివృద్ధి చెందుతోంది. అయితే రాకెట్‌లను, శాటిలైట్‌లను అక్కడి పంపి, వాటి అవసరం తీరిన తర్వాత అక్కడే వదిలేస్తున్నారు తప్ప వాటిని పునర్వినియోగించకపోవడం, సమూలంగా నాశనం చేయకపోవడం వల్ల అవి అక్కడే చెత్తలాగ పేరుకుపోయాయి. ఇప్పుడు ఆ అంతరిక్ష చెత్త విపరీతంగా పెరిగిపోయి, సరిగా పనిచేస్తున్న శాటిలైట్‌లకు, కొత్తగా పంపబోయే రాకెట్‌లకు అడ్డంకి […]
దిశ, వెబ్‌డెస్క్: భూమ్మీద మానవజాతి తమ అవసరాల కోసం రోజుకో రాకెట్ ద్వారా శాటిలైట్‌లను అంతరిక్షంలోకి పంపించి.. రిమోట్ సెన్సింగ్, శాటిలైట్ టెక్నాలజీల సాయంతో అభివృద్ధి చెందుతోంది. అయితే రాకెట్‌లను, శాటిలైట్‌లను అక్కడి పంపి, వాటి అవసరం తీరిన తర్వాత అక్కడే వదిలేస్తున్నారు తప్ప వాటిని పునర్వినియోగించకపోవడం, సమూలంగా నాశనం చేయకపోవడం వల్ల అవి అక్కడే చెత్తలాగ పేరుకుపోయాయి. ఇప్పుడు ఆ అంతరిక్ష చెత్త విపరీతంగా పెరిగిపోయి, సరిగా పనిచేస్తున్న శాటిలైట్‌లకు, కొత్తగా పంపబోయే రాకెట్‌లకు అడ్డంకి తయారై తలనొప్పులు తీసుకొస్తున్నాయి. అందుకే ఈ చెత్తను క్లియర్ చేయాల్సిన అవసరం ఇప్పుడు పెరిగిపోయింది. మరి ఎవరు చేస్తారు?
స్పేస్ ప్రాజెక్టులు అనగానే వెంటనే ముందుకొచ్చే కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ అని అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్లే ఈ అంతరిక్ష చెత్తను శుభ్రం చేసే ప్రాజెక్టును ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వారి స్టార్‌షిప్ రాకెట్ వ్యవస్థ ద్వారా అంతరిక్ష చెత్తను శుభ్రం చేయబోతున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గ్వెన్నే షాట్‌వెల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వంద మంది ప్రయాణికులను మోయగలిగే తమ స్టార్‌షిప్ రాకెట్లు, అంతరిక్షంలో పనికిరాకుండా పడి ఉన్న రాకెట్, శాటిలైట్ విడిభాగాలను భూమ్మీదకు తీసుకురాగలవనే నమ్మకం తనకు ఉందని గ్వెన్నే అన్నారు.