హైక్వాలిటీ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్‌నెట్ : విజయవంతమైన స్పేస్ ఎక్స్ ప్రయోగం
దిశ,వెబ్‌డెస్క్: హైక్వాలిటీ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్‌నెట్‌ను అందించాలన్న లక్ష్యంతో ఎలన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రయత్నం సఫలం అవ్వాలంటే 10 ఏళ్లలో 12వేల శాటిలైట్లను స్పేస్ లోకి పంపాలి. అలా రాకెట్లను స్పేస్ లోకి పంపేందుకు ఎలన్ మస్క్ ‘స్టార్‌లింక్ మిషన్’కు శ్రీకారం చుట్టారు. ఈ మిషన్ లో భాగంగా 2019 మే 24న ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 60 శాటిలైట్లను, జనవరి 21, 2021 నాటికి 1,035 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు. […]
దిశ,వెబ్‌డెస్క్: హైక్వాలిటీ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్‌నెట్‌ను అందించాలన్న లక్ష్యంతో ఎలన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రయత్నం సఫలం అవ్వాలంటే 10 ఏళ్లలో 12వేల శాటిలైట్లను స్పేస్ లోకి పంపాలి. అలా రాకెట్లను స్పేస్ లోకి పంపేందుకు ఎలన్ మస్క్ ‘స్టార్‌లింక్ మిషన్’కు శ్రీకారం చుట్టారు. ఈ మిషన్ లో భాగంగా 2019 మే 24న ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 60 శాటిలైట్లను, జనవరి 21, 2021 నాటికి 1,035 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు. తాజాగా ఈరోజు మరో 60 శాటిలైట్లను ఎలన్ మస్క్ తన స్పేస్ ఎక్స్ కంపెనీ ఆధ్వర్యంలో పంపారు. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ కాంప్లెక్స్ 39ఎ(ఎల్‌సి-39ఎ) నుంచి ఫాల్కన్ 9 రాకెట్ సహాయంతో 60 స్టార్‌లింక్ ఉపగ్రహాలను మోసుకెళ్లింది.