Jiostar: పూర్తయిన రిలయన్స్, డిస్నీ విలీనం.. చైర్‌పర్సన్‌గా నీతా అంబానీ

జాయింట్ వెంచర్ సంస్థకు ఛైర్‌పర్సన్‌గా నీతా అంబానీ నియామకం

Update: 2024-11-14 18:30 GMT
Jiostar: పూర్తయిన రిలయన్స్, డిస్నీ విలీనం.. చైర్‌పర్సన్‌గా నీతా అంబానీ
  • whatsapp icon

దిశ, బిజినెస్ బ్యూరో: భారత మీడియా రంగంలో అతిపెద్ద విలీన ప్రక్రియ గురువారం ముగిసింది. రిలయన్స్, గ్లోబల్ మీడియా మేజర్ వాల్ట్ డిస్నీకి చెందిన మీడియా విభాగం విలీనం పూర్తయినట్టు ఇరు సంస్థలు ప్రకటించాయి. దీంతో రూ. 70,352 కోట్లతో దేశంలోనే అతిపెద్ద మీడియా సంస్థ ఇరు సంస్థల జాయింట్ వెంచర్ ఏర్పాటైంది. కొత్త సంస్థలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 11,500 కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా 16.34 శాతం వాటాను సొంతం చేసుకోగా, వయాకామ్ 18కి 46.82 శాతం, డిస్నీకి 36.84 శాతం వాటాతో యాజమాన్యం ఏర్పడింది. అలాగే, జాయింట్ వెంచర్ సంస్థకు ఛైర్‌పర్సన్‌గా నీతా అంబానీ నియామకం కాగా, వైస్-ఛైర్‌పర్సన్‌గా ఉదయ్ శంకర్ ఉండనున్నారు. ఈ విలీనంతో 100కు పైగా టీవీ ఛానెళ్లు ఒకే సంస్థ కింద ఉంటాయి. అలాగే జియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలు కలిపి జియోస్టార్‌గా మారనున్నాయి. 

Tags:    

Similar News