ఆ దాడులు చేయండి.. పోలీసులకు ఎస్పీ ఆదేశాలు జారీ..
దిశ, అనంతగిరి: సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీస్ స్టేషన్ ను ఎస్పి రాజేంద్రప్రసాద్ శుక్రవారం రాత్రి ఆకశ్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. అనంతగిరి మండలం కోదాడ పట్టణానికి దగ్గరలో ఉండటంతో కొంతమంది ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలకు, గంజాయి వంటి చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని, అటువంటి స్థావరాలపై దాడులు జరపాలని […]
దిశ, అనంతగిరి: సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీస్ స్టేషన్ ను ఎస్పి రాజేంద్రప్రసాద్ శుక్రవారం రాత్రి ఆకశ్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. అనంతగిరి మండలం కోదాడ పట్టణానికి దగ్గరలో ఉండటంతో కొంతమంది ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలకు, గంజాయి వంటి చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని, అటువంటి స్థావరాలపై దాడులు జరపాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
అనంతగిరి మండలాన్ని గంజాయి రహిత మండలంగా చేసేందుకు కృషి చేయాలని పోలీస్ సిబ్బందిని కోరారు. మండల ప్రజలు సైతం అక్రమాలు జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పెట్రోలింగ్ పెంచాలని, 100 కు ఫోన్ చేసిన వెంటనే స్పందించి వేగంగా ఫోన్ చేసిన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట కోదాడ డీఎస్పి రఘు, ఏఎస్ఐ ఇస్మాయిల్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.