మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబును కొట్టిన పోలీస్..?
దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబుపై చేయిచేసుకున్నాననంటూ వస్తున్న వార్తలను గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ఖండించారు. తాను చేయి చేసుకోలేదని చెప్పుకొచ్చారు. రమ్య ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సర్ధిచెప్పేందుకు తాను చెయ్యి అడ్డుపెట్టానే తప్ప ఆనంద్ బాబును కొట్టలేదన్నారు. ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయోద్దన్నారు. దళితనేతను కొట్టిన గుంటూరు రూరల్ ఎస్పీ అంటూ కొన్ని మీడియా చానెల్స్, సోషల్ మీడియాలో వార్తలు రావడం బాదించిందన్నారు. తాను కూడా కర్ణాటకలో దళిత […]
దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబుపై చేయిచేసుకున్నాననంటూ వస్తున్న వార్తలను గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ఖండించారు. తాను చేయి చేసుకోలేదని చెప్పుకొచ్చారు. రమ్య ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సర్ధిచెప్పేందుకు తాను చెయ్యి అడ్డుపెట్టానే తప్ప ఆనంద్ బాబును కొట్టలేదన్నారు. ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయోద్దన్నారు. దళితనేతను కొట్టిన గుంటూరు రూరల్ ఎస్పీ అంటూ కొన్ని మీడియా చానెల్స్, సోషల్ మీడియాలో వార్తలు రావడం బాదించిందన్నారు. తాను కూడా కర్ణాటకలో దళిత కులానికి చెందిన వ్యక్తినేనని విశాల్ గున్నీ చెప్పుకొచ్చారు. తనకు కులం, మతం, పార్టీలతో సంబంధం లేదని.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోనన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై చర్యలు తీసుకుంటామని అందులో క్యాస్ట్, పార్టీలు, రిలీజియన్స్‌కు ఏమాత్రం తావుండదన్నారు. వాస్తవాలను మాత్రమే రాయాలని అభూత కల్పనలు సృష్టించవద్దని ఎస్పీ విశాల్ గున్నీ మీడియాను కోరారు.