సిబ్బంది రక్షణే ప్రథమ కర్తవ్యం: ఎస్పీ రెమా రాజేశ్వరి
దిశ, మహబూబ్‌నగర్: కరోనా నివారణకు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది ఆరోగ్య పరిరక్షణే తన ప్రాథమిక బాధ్యత అని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో సిబ్బందితో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ కరోనా అంటువ్యాధి, అత్యంత భయానక రీతిలో ప్రపంచాన్ని చుట్టేస్తోందని తెలిపారు. వైరస్ నుంచి మన ప్రజలను రక్షించేందుకు మొదట మనలను మనం కాపాడుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో ఉండే సిబ్బంది నిరంతరం […]
దిశ, మహబూబ్‌నగర్: కరోనా నివారణకు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది ఆరోగ్య పరిరక్షణే తన ప్రాథమిక బాధ్యత అని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో సిబ్బందితో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ కరోనా అంటువ్యాధి, అత్యంత భయానక రీతిలో ప్రపంచాన్ని చుట్టేస్తోందని తెలిపారు. వైరస్ నుంచి మన ప్రజలను రక్షించేందుకు మొదట మనలను మనం కాపాడుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో ఉండే సిబ్బంది నిరంతరం గోరు వెచ్చని నీళ్లు తాగేందుకు వీలుగా థర్మో స్టీల్ బాటిళ్లను సిబ్బందికి అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సాయి మనోహర్, తివారి, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Tags: Mahabubnagar,sp,Rema rajeshwari,meeting,