టీ పొడి తయారీలో చేతివాటం.. టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు
దిశ, చార్మినార్: శరీరాన్ని ఉత్తేజ పరచడానికి.. నిద్రమత్తును వదలించడానికి అందరూ తరచుగా తాగేది టీ. అలాంటి టీ తయారీలో వాడే చాయ్ పత్తిని కూడా అక్రమార్కులు వదలడం లేదు. అక్రమ సంపాదనే ధ్యేయంగా చివరకు టీ పొడి తయారీలోనే తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పలు బ్రాండ్ల పేర్లతో రంగురుచి కోసం కెమికల్స్‌తో తయారు చేస్తున్న నకిలీ టీ పొడి తయారీ కేంద్రంపై దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు షాహినాత్ గంజ్ పోలీసులతో […]
దిశ, చార్మినార్: శరీరాన్ని ఉత్తేజ పరచడానికి.. నిద్రమత్తును వదలించడానికి అందరూ తరచుగా తాగేది టీ. అలాంటి టీ తయారీలో వాడే చాయ్ పత్తిని కూడా అక్రమార్కులు వదలడం లేదు. అక్రమ సంపాదనే ధ్యేయంగా చివరకు టీ పొడి తయారీలోనే తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పలు బ్రాండ్ల పేర్లతో రంగురుచి కోసం కెమికల్స్‌తో తయారు చేస్తున్న నకిలీ టీ పొడి తయారీ కేంద్రంపై దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు షాహినాత్ గంజ్ పోలీసులతో దాడులు నిర్వహించారు. రూ.6లక్షల విలువైన నకిలీ టీ పొడి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బేగంబజార్ ఫీల్‌ఖానాకు చెందిన విష్ణు గోపాల్ తివారీ(54) నిర్వహిస్తున్న సాయినాథ్ టీ పొడి ఏజెన్సీలో అనుమతులు లేకుండా వివిధ బ్రాండ్ల పేర్లతో రసాయనాలను ఉపాయోగించి నకిలీ టీ పొడి తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
ఈ మేరకు దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర బృందం, షాహినాయత్ గంజ్ పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ప్రీమియం రెడ్ రోస్ టీ, దిల్ ఖుష్ గణేష్ టీ, రెడ్ గులాబ్, తులసీ సుప్రీం తదితర బ్రాండ్ల పేర్లతో ఎలాంటి అనుమతులు లేకుండా రంగు రుచి కోసం టెట్రాజైన్ అనే రసాయనాన్ని కలుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ.6లక్షల విలువైన టీ పొడి సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యజమాని విష్ణుగోపాల్తివారీని అదుపులోకి తీసుకున్న సౌత్జోన్టాస్క్ ఫోర్స్ పోలీసులు స్థానిక పోలీసులకు అప్పగించారు.