గుడ్‌న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే
దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్ నేపథ్యంలో రద్దు చేసిన 82 రైళ్లను ప్రయాణికుల సౌకర్యార్థం తిరిగి ఈనెల 19 నుంచి పునరుద్దరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో 16 ఎక్స్ ప్రెస్ రైళ్లు, 66 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయన్నారు. ప్రయాణికులు విధిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని, సాధ్యమైనంత వరకు భౌతిక దూరం పాటించాలని కోరారు. రైల్వే స్టేషన్లలో కొవిడ్ చర్యలను పకడ్బందీ చేపడుతున్నామని.. పరిసరాలను […]
దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్ నేపథ్యంలో రద్దు చేసిన 82 రైళ్లను ప్రయాణికుల సౌకర్యార్థం తిరిగి ఈనెల 19 నుంచి పునరుద్దరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో 16 ఎక్స్ ప్రెస్ రైళ్లు, 66 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయన్నారు. ప్రయాణికులు విధిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని, సాధ్యమైనంత వరకు భౌతిక దూరం పాటించాలని కోరారు. రైల్వే స్టేషన్లలో కొవిడ్ చర్యలను పకడ్బందీ చేపడుతున్నామని.. పరిసరాలను శానిటైజర్ చేస్తున్నామని తెలిపారు. ఈనెల 19న 10 ఎక్స్ ప్రెస్, 29 ప్యాసింజర్ రైళ్లు, 20న రెండు ఎక్స్ ప్రెస్,19 ప్యాసింజర్ రైళ్లు, 21న 3 ఎక్స్ ప్రెస్, 16 ప్యాసింజర్, 21న ఒక ఎక్స్ ప్రెస్, 3 ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయన్నారు. ప్రయాణికులు వివరాలకు రైల్వేశాఖ వెబ్ సైట్‌ను చూడాలని కోరారు.