కుమారుడి ఘాతుకం.. నిర్ఘాంతపోయిన తండ్రి!

దిశ, వెబ్‌డెస్క్ : వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండాల్సిన కొడుకు సభ్య సమాజం తలదించుకునే పని చేశాడు. అతను చేసిన పనికి ఏం చేయాలో తెలియని తండ్రి నిర్ఘాంతపోయాడు. వివరాల్లోకివెళితే.. 40 ఏళ్ల టీవీ యాక్టర్ ఇంట్లో ఒంటరిగా ఉన్న తన తల్లి (58)పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఇంట్లోని డబ్బులు మరియు బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణె నగరం సమీపంలోని ఓషివారా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం […]

Update: 2021-01-22 09:36 GMT

దిశ, వెబ్‌డెస్క్ : వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండాల్సిన కొడుకు సభ్య సమాజం తలదించుకునే పని చేశాడు. అతను చేసిన పనికి ఏం చేయాలో తెలియని తండ్రి నిర్ఘాంతపోయాడు. వివరాల్లోకివెళితే.. 40 ఏళ్ల టీవీ యాక్టర్ ఇంట్లో ఒంటరిగా ఉన్న తన తల్లి (58)పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఇంట్లోని డబ్బులు మరియు బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణె నగరం సమీపంలోని ఓషివారా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

విషయం తెలుసుకున్న తండ్రి (78) ఏం చేయాలో తెలియని స్థితిలో నిర్ఘాంతపోగా.. నిందితుని తండ్రి మూడో భార్య స్థానిక పోలీసులను ఆశ్రయించి అసలు విషయాన్ని వెల్లడించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడికి వారి తల్లిదండ్రులకు మధ్య ఇదివరకు ఏమైనా తగాదాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు నిందితుడు పలు టీవీ సీరియల్లకు డైరెక్టర్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News